Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్
పట్టణానికి చెందిన కుక్కునూరు పృథ్వీ తేజ, చంద్రకంటి రాహుల్ ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించగా ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి వారిని అభినందించారు.పృథ్వీతేజ 120 మార్కులకు గాను 104 మార్కులు సాధించగా రాహుల్ 120 మార్కులు గాను 92 మార్కులు సాధించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంకా కష్టపడి చదువుకోవాలని హుజూర్నగర్ పట్టణానికి, తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు. స్నేహితులు పాల్గొన్నారు.