Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామన్నపేట
చలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా యాదాద్రి జిల్లాలో డివైయఫ్ఐ., ఎస్ఎఫ్ఐ నాయకుల, కార్యకర్తల ముందస్తు అక్రమ అరెస్టులు ఉద్యమాలను అపలేవని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు నాగటి ఉపేందర్ అన్నారు. ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా శుక్రవారం స్థానిక పోలీసులు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ నాయకులను ముందస్తుగా అరెస్టు నిర్వహించారు. ఈ సందర్భంగా నాగటి ఉపేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి ఇవ్వాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అరెస్టు అయిన వారిలో డీివైఎఫ్‌ఐ మండల నాయకులు గోగు లింగస్వామి, మునికుంట్ల లెనిన్, శానగొండ వెంకటేశ్వర్లు, శానగొండ రాము, ఆకిటి మల్లేశం తదితరులు ఉన్నారు.
ఆలేరుటౌన్ :ఉద్యోగాలు భర్తీ చేయాలని, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ,డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడికి తరలివెళ్తున్న ఆయా సంఘాల నాయకులను ఎస్సై ఇద్రీస్ అలీ ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు .అరెస్టయిన వారిలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్ , జిల్లా సహాయ కార్యదర్శి చెన్న రాజేష్ ,ఉపాధ్యక్షుడు వడ్డేమాన్ విప్లవ, భువనగిరి గణేశ్ , మాదాణి నవీన్ ,పేరాల రమేష్ , తదితరులు ఉన్నారు
చౌటుప్పల్ :కొలువుల సాధన కోసం ప్రగతి భవన్ ముట్టడికి శుక్రవారం బయలుదేరిన డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్టుచేయడం సరికాదని డీవైఎఫ్ఐ జిల్లా సహాయకార్యదర్శి ఎండి.ఖయ్యుమ్పాషా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు వేయకపోవడం సిగ్గుచేటన్నారు. అరెస్టు అయిన వారిలో డీవైఎఫ్ఐ మున్సిపాలిటీ అధ్యక్షులు దేప రాజు, కార్యదర్శి ఎమ్‌డి.ఖయ్యుమ్, సహాయకార్యదర్శి బలరాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఎమ్‌డి.ఖాసీమ్, మనోజ్‌కుమార్ ఉన్నారు.
వలిగొండ : విద్య ఉపాధి సమస్యల పరిష్కారానికై ఖాళీగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని కోరుతూ శుక్రవారం ప్రగతి భవన్ ముట్టడించడానికి వెళుతున్న డివైఎఫ్ఐ ఎస్ ఎఫ్ఐ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఆ సంఘం మండల కార్యదర్శి జ్ఞానభూమి యాదగిరి, డీవైఎఫ్ఐ మండల అధ్యక్షులు వడ్డె మధు ,ఆ సంఘం నాయకులు నవీన్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.