Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
దేశంలో ఐటీ రంగానికి ఆద్యుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహాంగీర్ అన్నారు. శుక్రవారంస్థానిక 23వ వార్డు ఇందిరానగర్‌లో బోయవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ 77వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ ఆయన పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కరకాలు సుదర్శన్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కొల్లూరి రాజు,యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు ముత్యాల మనోజ్,అసెంబ్లీ నాయకులు కాకునూరి మహేందర్,కసరబోయిన సాయి,వదిగల్ల ప్రసాద్, గాయపాకు వెంకటేష్,శివ కేశవ,సిద్ధూ, నాగరాజు, ప్రభాకర్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మున్సిపల్ కేంద్రంలోని రాజీవ్ స్మారక భవనంలో కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారంమాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌గాంధీ 77వ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ట్ మున్సిపాలిటీ అధ్యక్షులు మొగుదాల రమేశ్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉబ్బు వెంకటయ్య, వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కొయ్యడ సైదులుగౌడ్, నాయకులు సుర్వి నర్సింహాగౌడ్, సందగల్ల సతీశ్, కామిశెట్టి భాస్కర్, ఎమ్ఎ.ఖయ్యుమ్, లందగిరి భీమయ్య, చామకూర రాజయ్య, యాదయ్య, చింతల సాయిలు, ఆవుల యేసు పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ :మండల కేంద్రంలో శుక్రవారం ఇందిరా కాంగ్రెస్ భవనం ఆవరణలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల అయిలయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలోఆలేరు ,యాదగిరిగుట్ట ఎంపీపీలు గంధమల్ల అశోక్ ,ఎంపీపీ చీర శ్రీశైలం, మండల పట్టణ పార్టీ అధ్యక్షులు కొండ రాజు వెంకటేశ్వరరాజు ఎంఎ ఎజాజ్ ,పీఏసీఎస్ డైరెక్టర్ కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ ఎండీజైనోద్దీన్, నాయకులు వల్లపు ఉప్పలయ్య , అజరు, రమేష్, ఎండీ బాబా,తదితరులు పాల్గొన్నారు .
మోటకొండూర్: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా శుక్రవారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి మిఠాయిలు పంపిణీ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు తండ పాండురంగయ్య గౌడ్ ,ఉప సర్పంచ్ రేగు శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బుగ్గ శ్రీశైలం, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వంగపల్లి మహేందర్ వార్డు సభ్యులు కొల్లూరి పోషయ్య, కాంబోజు నాగరాజు,బుగ్గ మహేష్ తదితరులు పాల్గొన్నారు.
గుండాల:మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఓబీసీ సెల్ మండల అధ్యక్షుడు సూదగాని రామచంద్రయ్య గౌడ్ పూలమాల వేసి నివాళులర్పించారు.ఈకార్యక్రమంలో గుండాల పట్టణ అధ్యక్షులు అన్నేపర్తీ యాదగిరి,మండల సమన్వయ కమిటీ సభ్యులు పొడిశెట్టి వెంకన్న, యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఆవుల సాయిప్రసాద్,మైస రమేశ్,కొడపర్తి శేఖర్,రాములు తదితరులు పాల్గొన్నారు.
తుర్కపల్లి: మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు దానవత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రాజీవ్గాందృ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు దానవత్ భాస్కర్ నాయక్, ఎంపీటీసీలు వనజ హన్మంత్ రెడ్డి, దానవత్ మోహన్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి చాడ భాస్కర్ రెడ్డి,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు పట్టు నాయక్,ఎస్సీ సెల్ అధ్యక్షులు రఘు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు అసద్ , తదితరులు పాల్గొన్నారు.
రాజాపేట : మండల కేంద్రంలో ఇందిరాగాంధీ గారి విగ్రహం వద్ద మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్, కోమటిరెడ్డి రాష్ట్ర అధ్యక్షులు మెండు భాస్కర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు డొంకెనా భాస్కర్ గౌడ్, మండల నాయకులు ఎరగోకుల చంద్రయ్య ,పారుపల్లి రామ్ రెడ్డి ,రాంగల అమరేందర్ ,భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
్ మోత్కూర్:: పట్టణకేంద్రంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుండగోని రామచంద్రు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థిని కల్వల కీర్తి ప్రియకు పట్టణ అధ్యక్షుడు రామచంద్రు రూ.2 వేలు అందజేసి శాలువ కప్పి సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు మందుల సురేష్, కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, నాయకులు పసునూరి యాదయ్య, అన్నెపు నర్సింహ, బందెల రవి, బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని పాతబస్టాండు ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహమ్మద్ జమీరుద్దీన్ , మాజీ ఎంపీటీసీ సాల్వే ర్ అశోక్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ సభ్యులు మహ్మద్ అజీముద్దీన్, మండల అధ్యక్షులు మహమ్మద్ మన్సూర్ అలీ, కిసాన్ సెల్ పట్టణ అధ్యక్షులు మహ్మద్ ఎజాస్, ఎన్ ఎస్ యూ ఐ మండలఅధ్యక్షులు మహమ్మద్ జానీ, సీనియర్ నాయకులు మహమ్మద్ జానీ భారు, రమేష్, మహేశ్వరం అశోక్, రిజ్వాన్, నర్సింహా, మహ్మద్ లతీఫ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అడ్డగుడూర్ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రాచకొండ రమేష్ , టౌన్ అధ్యక్షులు గూడెపు పాండు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కేకు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో బ్యాంక్ డైరెక్టర్ బైరెడ్డి అశోక్ రెడ్డి ,సూర్యాపేట జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చెడే మహేందర్ ,్ మండల అధ్యక్షుడు పొలపాక అబ్బులు ,తుంగతుర్తి నియోజకవర్గ యూత్ కాంగ్రెసి ఉపాఢ్యక్షులు సూరారం నవీన్ ,బోమ్మగాని లక్ష్మయ్య ,యూవజన నాయకులు పాక సింహాద్రి , గుగ్గిళ్ల భారత్ ,సందీప్ రెడ్డి ,సైదులు , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.