Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భువనగిరి
పట్టణకేంద్రంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలు ఘనంగా అమ్మవారికి పూజలు నిర్వహించి నైవేద్యాలు పెట్టారు. ఈకార్యక్రమంలో 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ,రమణ, మన్నెమ్మ, శ్యామల, స్వప్న, అనసూయ, కళ్యాణి, ఆదిలక్ష్మి, మనీషా, సుజాత, భాగ్యమ్మ, వర్షిని, స్రవంతి, హర్షిత పాల్గొన్నారు.
చౌటుప్పల్ : మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం శ్రావణమాస పూజల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీ కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు-సంధ్య దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ బత్తుల శ్రీశైలం, దేవాలయకమిటీ అధ్యక్షులు దేవరపల్లి గోవర్థన్‌రెడ్డి, జక్కర్తి శేఖర్, ఉప్పల కుసుమ, కాసుల వెంకటేశం, నల్ల పర్వతాలు, చింతల విజయలక్ష్మీ, కరుణ, దీపిక, శైలజ, జంగమ్మ పాల్గొన్నారు.
భూదాన్‌పోచంపల్లి : పురపాలక కేంద్రంలో లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో నిర్వహించిన వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న మహిళలు పెద్దఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నారాయణ స్వామి భజన మండలి మాజీ అధ్యక్షుడు అంకం మురళి , అంకం, అంకం యాదగిరి, అధ్యక్షుడు జో గు బుచ్చిబాబు, బాతుల బాలాజీ, మహేష్ నారాయణ, శంకర మహిళా భజన మండలి అధ్యక్షురాలు గుండు జయలక్ష్మి, శకుంతల, కమలమ్మ ,శారద, భార్గవి, రాజ్యలక్ష్మి, వర్మ తదితరులు పాల్గొన్నారు.