Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్గొండ
పట్టణంలో అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం 8వ వార్డు లో ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి కోసం నల్గొండ పట్టణానికి వలస వచ్చి 20 ఏండ్లుగా అద్దె ఇండ్లల్లో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు.కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయి ఇంటి అద్దె కట్టలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ కమిటీ సభ్యులు మారగోని నగేష్ ,ఓర్సు వెంకటేశ్వర్లు,కళ్యాణి ,జ్యోతి యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి, రాములు పాల్గొన్నారు.