Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూర్
మోత్కూరు మార్కెట్ కమిటీ చైర్మెన్‌గా నియామకమైన కొణతం యాకూబ్ రెడ్డి, వైస్ చైర్మెన్ మూగల శ్రీనివాస్‌తో పాటు పాలకవర్గ సభ్యులు శుక్రవారం హైదరాబాద్‌లో తుంగతుర్తి, ఆలేరు ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, గొంగిడి సునీతామహేందర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిశారు. తమను నియమించినందుకు కతజ్ఞతలు తెలుపుతూ పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు కంచర్ల చలపతి రెడ్డి, గడ్డం దశరథ, సోమ నర్సయ్య, సోమ వెంకటేశ్వర్లు, సోలిపురం లక్ష్మారెడ్డి, వంగరి మల్లయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొన్నెబోయిన రమేష్, బొడ్డుపల్లి కళ్యాణ్ చక్రవర్తి, గజ్జి మల్లేష్, సింగిల్ విండో చైర్మన్ కంచర్ల అశోక్ రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, తదితరులు పాల్గొన్నారు.