Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కేతెపల్లి
మండలంలోని ఇనుపాముల గ్రామంలో 65 వ జాతీయ రహదారి వెంట ఉన్న శివాలయాన్ని జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించారు. శివాలయానికి సంబంధించిన న ఆలయ విడిభాగాలు మల్లన్న గుట్ట పైన పెట్టారు.. శ్రీ పచ్చల పార్వతీ సోమేశ్వర స్వామి దేవాలయ శిథిలాల విడిభాగాలు లను పురావస్తు శాఖ సీఈఓ డాక్టర్ శివ నాగిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో శివనాగిరెడ్డి మాట్లాడుతూ కాకతీయ గణపతి దేవుని పాలనాకాలంలో క్రీస్తుశకం 13 లో శతాబ్దంలో లో కాకతీయ వాస్తుశిల్పి శైలిలో నిర్మించిన ఈ ఆలయ ద్వారా శాఖలు స్తంభాలు కాపురాలు గోడలపై చెక్కిన శిల్పాలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ప్రాచీనతను కోల్పోక ముందే ఆలయ పునర్నిర్మాణానికి పూనుకోవాలన్నారు. అందుకు అవసరమైన సహకారం పర్యవేక్షణ అందించడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటరెడ్డి ఆలయ చైర్మెన్ గోనుగుంట సత్యనారాయణ ధర్మకర్తలు పాల్గొన్నారు .