Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
ప్రభుత్వం బీసీ బంధు పథకాన్ని తీసుకొచ్చి ప్రతి కుటుంబానికీ రూ. 10 లక్షలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 24న హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీసీల ధర్మ పోరాట దీక్ష చేపడుతున్నట్టు బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీల వెంకటేష్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం ముందు ధర్నాకు సంబంధించిన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ యువజన అధ్యక్షులు మున్నాసు ప్రసన్న ,విద్యార్థి సంఘం అధ్యక్షులు అయితగాని జనార్ధన్ గౌడ్ ,గుండు వెంకటేశ్వర్లు ,కూరెళ్ళ విజరు కుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి, జిల్లా కార్యదర్శి కంభంపాటి శేఖర,్ తిరుపతి గౌడ్ ,గంజి యాదగిరిపాల్గొన్నారు.