Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
ట్రాన్స్‌కో ఏఏఈగా కిషన్‌లాల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. డివిజన్లో జనరల్ బదిలీల్లో భాగంగా నిడమనూరులో పని చేస్తున్న ఆయన బదిలీపై మిర్యాలగూడకు రూరల్‌కు వచ్చారు.ఈయన గతంలో హాలియా సబ్ ఇంజనీర్‌గా, పెద్దవూర ఏఏఈగా, హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో విధులు నిర్వహించి అక్కడ్నుంచి మళ్లీ మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని నిడమనూరులో పని చేశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కిషన్‌లాల్‌ను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పవర్ ఇంజనీర్స్ సంఘం నాయకులు రవీందర్‌రెడ్డి, పవర్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ కార్యవర్గం సీతారామరాజు, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మారం శ్రీనివాస్, 327 యూనియన్ డివిజన్ కార్యదర్శి రాజేశ్వర్‌రావు, 1104 యూనియన్ డివిజన్ కార్యదర్శి సోమాచారి, ఓసీ అసోసియేషన్ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మైనార్టీ అధ్యక్షులు రిజ్వాన్, ఉదరుకుమార్, బాలు, ఎల్.శ్రీనివాస్, ఏఈ రాజేశ్, సబ్ ఇంజనీర్లు జానయ్య, కష్ణారెడ్డి, శేఖర్, నర్సింహాచారి, లైన్మెన్లు రాజు, జానకిరెడ్డి, జలంధర్, రవినాయక్, వెంకయ్య, అసిస్టెంట్ లైన్మెన్ భిక్షం, కంప్యూటర్ ఆపరేటర్ దామమోదర్, ఆర్టిజన్ పాపయ్య, కాంట్రాక్టర్ భాస్కర్, గుండా శ్రీనివాస్, డ్రైవర్ వెంకన్న పాల్గొన్నారు.