Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నూతనకల్
మండలకేంద్రం నుండి తుంగతుర్తికి వెళ్తే రహదారిపై గుంతలు ఏర్పడడంతో చిన్నపాటి వర్షమొచ్చినా చెరువులను తలపిస్తుందని ఆరోపిస్తూ సీపీఐ(ఎం) నాయకులు శుక్రవారం రోడ్డుపై నీటిగుంతలలో వరి నాటేసి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి కందాల శంకర్‌రెడ్డి మాట్లాడుతూ నూతనకల్ -తుంగతుర్తి రహదారి ద్వారా దాదాపు పది గ్రామాలకు పైగా ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు, మోటార్ సైకిళ్లు, పాదచారులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తున్నారని రోడ్డు మొత్తం గుంతల మయం కావడంతో నిత్యం రాకపోకలు కొనసాగించే వివిధ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ విషయమై స్థానిక అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేకసార్లు విన్నవించినా ఫలితం లేదని విమర్శించారు.వెంటనే ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాల న్నారు.లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల నాయకులు బొజ్జ శ్రీను,పోలేపాక్ నగేష్ తోట్ల అచ్చయ్య, శ్రీనివాస్‌రెడ్డి, విజరు, సోమయ్య, వీరస్వామి,గుణగంటి లింగయ్య,చీమల సంతోష్, అంజపల్లి లక్ష్మయ్య, కందాల కష్ణారెడ్డి, తొట్ల లింగయ్య పాల్గొన్నారు.