Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెన్పహడ్
మండలంలోని పొట్లపహాడ్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు మేకపోతుల చిన్న లింగయ్య తాటిచెట్టు మీద నుండి పడి బలమైన గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..గీత కార్మికుడు మేకపోతుల చిన్నలింగయ్య మంగళవారం కల్లు కోసం తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు.దీంతో ఆయనకు గాయాలవగా వైద్యం కోసం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు.డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.జైగౌడ్ ఉద్యమ జిల్లా నాయకులు బత్తిని శోభన్, బంటు సందీప్ మాట్లాడుతూ చిన్న లింగయ్యను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.