Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో ప్రతి అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలని, పోషణలోపం లేకుండా చూడాలని జిల్లా సంక్షేమ అధికారి జ్యోతి పద్మ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో శాఖ ద్వారా చేపడుతున్న పలు అంశాలపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి లబ్దిదారులకు అంగన్వాడీ సేవలు అందేలా కషిచేయాలన్నారు.గర్భినులు,బాలింతలు,చిన్నారులకు అందిచే పౌష్టికాహారం విషయంలో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి అంగన్వాడీ టీచర్ ప్రతినెలా తల్లి పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దష్టి సారించి పోషణ లోపం లేకుండా చూడాలని, క్రమం తప్పకుండా ఎత్తు ,బరువులు తీస్తూ ఆరోగ్య జాగ్రత్తలు తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం టీ- సాట్ ద్వారా 3-6 సవంత్సరాల పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యపై అవగహన కల్పించడం తల్లీ బిడ్డల సంరక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తుందన్నారు.జిల్లా ప్రజలు సఖీ కేంద్రం ద్వారా సేవలు తప్పక వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సీడీపీఓలు, సూపర్వైజర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.