Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డాక్టర్ నాగునాయక్
నవతెలంగాణ-తుంగతుర్తి
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన వైద్యుల సేవలు మరువలేనివని, వైద్యవృత్తి దేవుడిచ్చిన వరమని మండల వైద్యాధికారి నాగునాయక్,జిల్లా అధికారి అంజయ్య అన్నారు. సోమవారం ప్రాథమికఆరోగ్యకేంద్రంలో హెచ్ఈఓగా విధులు నిర్వహిస్తున్న పాశం గోవిందరెడ్డి జీహెచ్ఎంసీకి ఫారన్ సర్వీసెస్ డిప్యూటేషన్‌పై శానిటరీ ఇన్స్పెక్టర్గా బదిలీ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వైద్యవత్తి గొప్ప వరమన్నారు.కరోనా కీలక సమయంలో ప్రభుత్వం అందించిన సహకారంతో ప్రజలకు అన్ని స్థాయిల్లో మంచి వైద్యం అందించడానికి నిరంతరం కషి చేసిన వ్యక్తి గోవిందరెడ్డి అని కొనియాడారు.కరోనా సమయంలో మండలంలోని అన్ని గ్రామాలను పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారన్నారు.సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎంతో కషి చేశారన్నారు. ఆరునెలల సమయంలోనే మండల ప్రజల ఆదరాభిమానాలను పొందారన్నారు.ఈ సందర్భంగా గోవిందరెడ్డి మాట్లాడుతూ వైద్య వత్తి అనేది దేవుడు ప్రసాదించిన వరమని, ప్రజలకు సేవ చేయడానికి కల్పించిన గొప్ప అవకాశంగా భావిస్తానన్నారు.ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి, బదిలీలు పదోన్నతులు సహజమన్నారు.ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ సైదమ్మ, హెచ్ఈఓ సముద్రాల సూరి, స్టాఫ్‌నర్సు దీప్తి, హెల్త్‌అసిస్టెంట్ గాజుల సోమయ్య, నర్సింహాచారి, యాదగిరి, ఏఎన్ఎంలు భారతి, దేవేంద్ర, కమల, ఉపేంద్ర, స్వప్న, నాగరాజు, సతీష్, చొక్కయ్య, భాస్కర్, నవీన్ పాల్గొన్నారు.