Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్‌భగీరథ కార్మికులకు రూ.250 కోట్ల వేతనాలు విడుదల
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
అర్థాకలిలో మిషన్‌భగీరథ కార్మికుల జీవితాలు అనే శీర్షికతో 'నవతెలంగాణ' దినపత్రికలో ఈ నెల 19న కథనం ప్రచురితమైంది.దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రూ.250 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.జీఓ నెం:197ను విడుదల చేసింది. నవతెలంగాణ దినపత్రికలో ఆరునెలలుగా జీతాల కోసం ఎదురుచూసి ఏండ్ల తరబడిగా పని చేసిన నెలనెలా వేతనాలందక పడుతున్న ఇబ్బందుల గురించి వెలుగులోకి తేవడం, దీనికి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప ంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ స్పందించి ప్రభుత్వం ద్వారా కార్మికుల శ్రేయస్సు కోసం నిధులు విడుదల చేసినందుకుగాను టీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల రవి,జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశం, కోశాధికారి గట్టుప్పల్ సంజీవరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.జీఓ నెం: 11 ప్రకారం వేతనాలు పెంచి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.