Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మోటకొండూర్
బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమితులైన డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ను మండల పరిధిలోని కాటేపల్లి గ్రామానికి చెందిన స్వేరో స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి గంధమల్ల శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్లోని లకిడికపూర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర సమీక్ష సమావేశలో భవిష్యత్ కార్యాచరణ గూర్చి చర్చించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు, వేముల బలాస్వామి,ఎడ్ల పరమేశ్వర్, రాగిరి గన్నేశ్వర్ పాల్గొన్నారు.