Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మిషన్‌భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి
అ సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ -నల్లగొండ
మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని మిషన్ భగీరథ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని,కనీస వేతనం నెలకు రూ.21వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని, విధినిర్వహణలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ ,ఈఎస్ఐ గుర్తింపు కార్డులు వెంటనే అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సైదులు ప్రధాన కార్యదర్శి జంగిరాల శ్రీనివాస్ ,కార్మికులు ,తదితరులు పాల్గొన్నారు.