Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నవతెలంగాణ -నకిరేకల్
ఎన్ని ఆటంకాలు ఎదురైనా అభివద్ధిని కొనసాగిస్తామని స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం స్థానిక ఐశ్వర్య సాయి కల్యాణ మండపంలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 134 మంది లబ్దిదారులకు సుమారు రూ.కోటీ 35 లక్షల విలువగల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో అనేక మార్పులు జరిగి అభివద్ధిలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మెన్ నడికుడి ఉమారాణి వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మెన్ మురారి శెట్టి ఉమారాణి కష్ణమూర్తి, పీఏసీఎస్ చైర్మెన్ పల్ రెడ్డి మహేందర్ రెడ్డి, వైస్ చైర్మెన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
మతుల కుటుంబాలను పరామర్శించిన చిరుమర్తి
నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలోని మూసీరోడ్డులో చిలక పల్లి శ్రీనివాసులు, మండలంలోని చందుపట్ల గ్రామంలో రాపోలు అనసూర్య అనారోగ్యంతో మతి చెందారు. సోమవారం స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇరువురి మతదేహాలను సందర్శించి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, నాయకులు నడికుడి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ నాగులవంచ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.