Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేతెపల్లి
డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణాలను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు కందాల ప్రమీల డిమాండ్ చేశారు. సోమవారం మండలకేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆ సంఘ: మండల మహా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రమీల మాట్లాడుతూ సమాజంలో మహిళల పై హత్యలు, లైంగికదాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. మహిళలకు మహిళా బంధు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టి ఆర్థికంగా బలపడేందుకు కషిచేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు అధ్యక్షురాలుగా గుండగాని భాగ్యమ్మ, కార్యదర్శిగా ఆవుల నిర్మలను ఎన్నుకున్నారు. గుండగాని భాగ్యమ్మ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకురాళ్లు ఆది మల్ల అని,త ఆదిమల ఉమాదేవి, చింత మల్ల రాధిక ,జి.అవనిజ, జానమ్మ పాల్గొన్నారు