Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కేంద్ర ప్రభుత్వం బంగారు ఆభరణాలపై కొత్తగా విధించిన హెచ్‌యూఐడీని వ్యతిరేకిస్తూ పట్టణ బంగారం వెండి దుకాణాల వ్యాపారులు సోమవారం దుకాణాలను బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పలువురు బులియన్ మార్కెట్ యూనియన్ నాయకులు మాట్లాడుతూ హాల్‌మార్కింగ్‌ను తాము స్వాగతిస్తున్నామన్నారు.కానీ హెచ్ యూఐడీని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఈ విధానం ద్వారా చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేయలేరని పెద్దపెద్ద కార్పొరేట్ షోరూమ్‌లకు ఈ విధానం అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.కాగా వ్యాపారులకు మద్దతుగా గోల్డ్ వర్కర్స్ యూనియన్ మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో బులియన్ మర్చంట్ యూనియన్ నాయకులు కోటమధు, బుడిగం నరేష్, సుందరి వెంకటేశ్వర్లు, నాగార్జునరెడ్డి, చెన్నోజు వెంకటేశ్వర్లు, శ్రీధర్, రమేశ్, మేకల నరేష్, నవీన్, వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.