Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దేవరకొండ
క్రీడలలో ప్రతి ఒక్కరూ రాణించాలని దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాటికోల్ గ్రామానికి చెందిన యువకులకు క్రికెట్ కిట్టును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసికోల్లాసాన్ని కల్గిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మారుపాకుల అరుణసురేష్‌గౌడ్, వైస్‌ఎంపీపీ చింతపల్లి సుభాష్, రైతుబంధు అధ్యక్షుడు సిరందాసు కష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్‌గౌడ్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పున్న వెంకటేశ్వర్లు, బొడ్డుపల్లి కష్ణ పాల్గొన్నారు