Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆర్.ధనమూర్తి
నవతెలంగాణ-కోదాడరూరల్
ఉపాధ్యాయుల రేషనలైజేషన్‌తో విద్యార్థులకు నష్టమని, వెంటనే వాయిదా వేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు ఆర్.ధనమూర్తి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం బాలుర,బాలికల ఉన్నత పాఠశాలలో మండల శాఖ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లా డారు.పాఠశాలలు భౌతికంగా ప్రారంభించిన తర్వాత విద్యార్థుల సంఖ్య ఆధారంగా రేషనలైజేషన్ చేయాలన్నారు. ప్రస్తుతం రేషనలైజేషన్ చేస్తే ఉపాధ్యాయుల పోస్టులు తగ్గి విద్యార్థులకు నష్టం కలుగుతుందన్నారు. మండలంలో గుర్తించిన 5లేదా 6 పాఠశాల ల్లో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ తరగతికి ఒక ఉపాధ్యాయుడితో పాటు ప్రధానోపాధ్యాయుని పోస్టును కేటాయించాలని కోరారు.దశలవారీగా అన్ని పాఠశాలల్లో తెలుగు మీడియానికి సమాంతరంగా ఇంగ్లీష్‌మీడియం అమలు చేయాలని డిమాండ్ చేశారు.పాఠశాలలో స్కావెంజర్లను తిరిగి నియామకం చేయాలన్నారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, కోవిడ్ నిబంధనలతో తల్లిదండ్రుల అంగీకారంతో ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కోదాడ,చింతలపాలెం మండలాల అధ్యక్షులు పిచ్చయ్య, శ్రీనివాసరావు, నడిగూడెం మండల ఉపాధ్యక్షులు మోతీలాల్,బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి,ఉపాధ్యాయులు పాండురంగాచారి, రాజారావు, పూర్ణ చందర్రావు, భిక్షం, బోసుబాబు, భవాని, నర్సిరెడ్డి పాల్గొన్నారు.