Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కస్టమర్ల అభివద్ధే మా ధ్యేయం
అ సంస్థ సీఎండీ ఉప్పలయ్య
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అతిసమీపంలో రామాజీపేటలో సుమారు వంద ఎకరాల విస్తీర్ణంలో సురక్ష డెవెలపర్స్ న్యూ వెంచర్ ప్రారంభించినట్టు ఆ సంస్థ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలయ్య తెలిపారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి అతి సమీపంలో వంద ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో , ఈ వెంచర్ డీటీసీపీ అనుమతితో అన్ని సౌకర్యాలు కస్టమర్లకు కల్పించేలా అభివద్ధి చేసినట్టు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి అతిసమీపంలో 15ఏండ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా తీర్చి దిద్దడం ధ్యేయంగా పనిచేస్తున్నట్టు తెలిపారు.
లోకేషన్ ప్రత్యేకతలు
ఈ మెగా వెంచర్ నేషనల్ హైవే 163 కి కేవలం 200 మీటర్ల దూరంలో ఏర్పాటు చేయడం వల్ల కస్టమర్లకు భవిష్యత్తులో మంచి ధర లభిస్తుందన్నారు. వంగపల్లి రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉండటం ఈ వెంచర్ కు కలిసొచ్చే అవకాశమన్నారు. కేవలం ఐదు నిమిషాల సమయంలోనే రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి టెంపుల్ సిటీని చేరుకునే అవకాశం, జింకల పార్క్‌ను సందర్శించే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపారు. భువనగిరి ఖిల్లా కూడా టూరిజం పరిధిలో ఉన్నందున సమీపంలో ఉండటం కలిసి వచ్చే అంశం అన్నారు. వెంచర్ పక్కనే వివిధ రకాల( ఎడ్యుకేషనల్ )విద్యాసంస్థలు ఉన్నట్టు తెలిపారు.20 నిమిషాల ప్రయాణంలో ఏయిమ్స్ మెడికల్ యూనివర్సిటీ చేరుకోవచ్చన్నారు. వెంచర్‌కు సమీపంలో కొలనుపాక, జైన్ మందిర్ పర్యాటక కేంద్రాలు ఉన్నట్టు తెలిపారు. వెంచర్ పక్కనే రామోజీ పేట లో రెసిడెన్షియల్ ఇండ్లు ఉన్నాయన్నారు.
ప్రాజెక్టు ప్రత్యేకతలు
ఈ వెంచర్ డీటీసీపీి అనుమతితో లేఅవుట్ రూపొందించినట్టు తెలిపారు. 33 , 40 ఫీట్స్ సీసీ రోడ్ల నిర్మాణాన్ని వెంచర్లో చేపడుతున్నట్టు తెలిపారు.వెంచర్ మొత్తానికి కాంపౌండ్ వాల్ నిర్మిస్తూ ఆర్చి నిర్మాణం, 24 గంటల సెక్యూరిటీ సౌకర్యం కల్పిస్తున్నట్టు చెప్పారు. కర్బింగ్ స్టోన్స్‌తో ఫుట్ పాత్ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. చిన్నపిల్లలకు చిల్డ్రన్స్ పార్క్ తో పాటు, పెద్దలకు ప్లేగ్రౌండ్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. వెంచర్ లో ఎలక్ట్రిసిటీని కల్పిస్తూ, స్ట్రీట్ లైట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం చేపట్టనున్నట్టు తెలిపారు. వెంచర్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టి గ్రీనరీ పెంచనున్నట్టు తెలిపారు. వెంచర్లో ఎలాంటి పొల్యూషన్ లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా వెంచర్ రూపుదిద్దనున్నట్టు చెప్పారు. వెంచర్లో హెడ్ ట్యాంక్ నిర్మాణంతో పాటుగా అన్ని ప్లాట్లకు వాటర్ పైప్‌లైన్ వసతి కల్పిస్తామన్నారు. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ టైటిల్ ను అందిస్తూ, స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. మెగా వెంచర్లో 100శాతం వాస్తు ప్రకారం ప్లాంటింగ్ చేపట్టి నిర్మాణాలు చేపడుతూ 24 గంటల సెక్యూరిటీని కల్పిస్తామన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో 15 ఏండ్లుగా పనిచేసి కస్టమర్లకు అందుబాటులో ఉండేలా ప్రతి పైసాకు భవిష్యత్తులో రక్షణ కల్పించేందుకు సురక్ష ఇన్ఫ్రా ఒక సంస్థ అని తెలిపారు.