Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి
నవతెలంగాణ - నేరేడుచర్ల
సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్న క్రమంలో పారిశుద్ధ్యాన్ని తప్పనిసరిగా పాటించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి ఉపాధ్యాయులను ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. ప్రత్యక్ష తరగతులపై ప్రతి విద్యార్థికీ సమాచారం అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా చూడాలన్నారు. స్కూల్ ఆవరణలో ఎలాంటి చెత్తా లేకుండా చూడాలన్నారు. అనంతరం ప్రైమరీ స్కూల్లో మురుగు నీటితో నిండి ఉన్న బోరును పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై జిల్లా మలేరియా అధికారి సాహితిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ వ్యాధులు విస్తరిస్తున్న నేపథ్యంలో మున్సిపల్, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ చందమల్ల జయబాబు, మున్సిపల్ కమిషనర్ గోపయ్య, ఎంపీవోలు విజయకుమారి, లావణ్య, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎల్.శ్రీనివాస్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
తపారిశుధ్యం మెరుగుకు చర్యలు
గరిడేపల్లి : రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని కలెక్టర్ వినరు కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన స్థానిక హైస్కూల్‌ను పరిశీలించారు. ప్రత్యక్ష తరగతులపై ప్రతి విద్యార్థికీ సమాచారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి విద్యార్థీ తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్కూల్ ఆవరణలో ఎలాంటి చెత్త లేకుండా పరిశుభ్రం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, సర్పంచ్ త్రిపురం సీతారాంరెడ్డి, పాఠశాల చైర్మెన్ నగేష్ పాల్గొన్నారు.