Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవతెలంగాణ- భువనగిరిరూరల్
కేంద్రంలోని బీజేపీ మోడీ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలందరూ ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో ఆ పార్టీ 10 వ శాఖ మహాసభ గునుగుంట్ల శ్రీనివాస్, ఏదునూరి ప్రేమలత అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం కొచ్చిన ఏడేండ్ల కాలంలో ప్రజల హక్కులను, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ ఫెడరల్ వ్యవస్థను దెబ్బ తీస్తూ లౌకిక వ్యవస్థ తీసివేయాలని కుట్రను చేస్తుందని విమర్శించారు. నిత్యం పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, అసమానతలు, పేదరికం, ఉపాధి కోసం వలసలు, పౌష్టికాహారం లోపం, ఆకలిచావులు, ఆత్మ హత్యలు నేడు దేశాన్ని చుట్టుముట్టి సంక్షోభంలో పడేశాయన్నారు. పార్లమెంటులో మెజారిటీ ఉన్నదని రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను, గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న కూలీలను కులాలగా విభజన చేసి చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పెద్దఎత్తున బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనాజిపురం గ్రామ శాఖ సభ్యుడు కడారి రాజమల్లు ఆ పార్టీ కార్యాలయం కోసం 181 గజాల స్థలం (అమ్మ నాన్న జ్ఞాపకార్థం) ఇవ్వగా వారికుటుంబాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, జిల్లా కమిటీ సభ్యులు సిరిపంగి స్వామి, మండల పార్టీ కార్యదర్శి దయ్యాల నరసింహ, పార్టీ మండల కమిటీ సభ్యులు ఏదునూరి మల్లేశం, అబ్దులపురం వెంకటేష్, గ్రామ శాఖ కార్యదర్శి బొల్లెపల్లి కుమార్, ఒకటవ శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, రెండవ శాఖ కార్యదర్శి ముచ్చపతి బాలయ్య,కడారి రాజమల్లు, మహామద్ జహంగీర్, కడారి కష్ణ,నారగోని బాలరాజు, ముచ్చపతి జంగమ్మ,కడారి కష్ణవేణి, కళ్యాణి, తోటకూర మల్లేశం, నవీన్, క్రాంతికుమార్, బాలరాజు, వెంకటేష్, భరత్ పాల్గొన్నారు.