Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుంగతుర్తి
చిన్నారులకు ప్రభుత్వం అమలు చేసే వ్యాధి నిరోధక టీకాలను సద్వినియోగం చేసుకోవాలని సీహెచ్ఎఫ్డబ్ల్యూ రాష్ట్ర అధికారి కె.రామకృష్ణ సూచించారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వ్యాధినిరోధక టీకాలు భద్రపరిచే ఐఎల్ఆర్ డీప్ ఫ్రిజ్, వ్యాక్సిన్ నిలువల రికార్డులను ఆయన తనిఖీ చేశారు. అనంతరం వెలుగుపల్లి గ్రామంలో పర్యటించారు. బుధవారం, శనివారం నిర్వహించే వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాధినిరోధక టీకాల అధికారి పెండెం వెంకటరమణ, మండల వైద్యాధికారి భూక్య నాగునాయక్, హెచ్ఈవో సముద్రాల సూరి, హెల్త్ అసిస్టెంట్లు గాజుల సోమయ్య, నర్సింహాచారి, యాదగిరి, నవీన్, నాగరాజు, భారతి, దేవేంద్ర, స్వప్న తదితరులు పాల్గొన్నారు.