Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
సెప్టెంబర్ ఒకటి నుండి పునర్ప్రారంభం కానున్న విద్యాసంస్థల ఏర్పాటు కోసం మండలంలోని ప్రతి పాఠశాలను సిద్ధం చేయాలని ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి పాఠశాల సిబ్బందికి, ఆయా గ్రామాల సర్పంచులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన ప్రకారం మండలంలోని ప్రజాప్రతినిధులు విద్యార్థుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాలతో పాటు అన్ని పాఠశాలలు ప్రత్యేక తరగతులు ప్రారంభం కానున్న దష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాంబశివరావు, ఎంపీఓ ఫరీద్,ఏపీఓ యాదయ్య, అన్ని గ్రామాల పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.