Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చంద్రారెడ్డి
నవతెలంగాణ-బీబీనగర్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ వెంటనే రద్దుచేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌చేశారు. బుధవారం బీబీనగర్ పారిశ్రామిక క్లస్టర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తీసుకురాలేదని, ఉన్న పరిశ్రమలను తొలగించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కనీస వేతనాల జీఓను సవరించలేదని విమర్శించారు. కనీస వేతనం రూ.21వేలు నిర్ణయించాలని డిమాండ్‌చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ 8 నుండి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పారిశ్రామిక క్లస్టర్లో రాష్ట్ర నాయకత్వం పాదయాత్ర చేయనుందని తెలిపారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ బండారు శ్రీరాములు, నాయకులు కందాడి దేవేందర్‌రెడ్డి, వంటల బస్వయ్య, కోతి యాదగిరి, పొట్ట రాజు, శ్రీనివాస్‌రెడ్డి, షాజహాన్ పాల్గొన్నారు.