Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహులు
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
రాష్ట్రంలో భూదాన్ భూములు అన్యాక్రాంతమవుతున్నప్పటికీ కాపాడాల్సిందిపోయి సీఎం కేసీఆర్ పేదలకిచ్చిన భూములను లాక్కొని అమ్ముకుంటున్నాడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు నర్సింహులు అన్నారు. బుధవారం భూదాన్ పోచంపల్లి సందర్శించి ఆచార్య వినోబా భవే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు ఫూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక భూదాన్ భూముల అవకతవకలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. భూదాన భూముల ఆక్రమణలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఫాస్ట్ ట్రాక్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిభూదాన భూములను రక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు చిలువేరు కాశీనాథ్, జాతీయ అధికార ప్రతినిధి పొన్నూరు నర్సిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ షరీఫ్ భువనగిరి పార్లమెంటు అధ్యక్షులు కష్ణమాచారి, రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షులు సంజీవ తదితరులు పాల్గొన్నారు.