Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ విద్య, వైద్యం 4వ స్థాయి సంఘం చైర్మెన్ కుడుదుల నగేశ్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వం అందింస్తున్న విద్య, వైద్యంపై నమ్మకం కలిగే విధంగా అధికారులు పని చేయాలని కాంగ్రెస్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ , 4వ స్థాయి సంఘం చైర్మెన్ డాక్టర్ కుడుదుల నగేశ్ అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ కార్యలయంలో విద్య, వైద్యంపై నిర్వమించిన 4వ స్థాయి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ నెలలో కోవిడ్ విజంభిస్తదని వస్తున్న వార్తల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎత్తివేసిన ఐసోలేషన్ కేంద్రాలను తిరిగి పునరుద్ధరణ చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పీహెచ్సీల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలన్నారు. జెడ్పీ సీఈవో కష్ణారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ నెల 28న అన్ని పాఠశాలల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని మండల అభివద్ధి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఈ సమావేశంలో అడ్డగూడూరు జెడ్పీటీసీ సభ్యులు జ్యోతిశ్రీరాములు, కో ఆప్షన్ సభ్యులు మహర్ కలిల్ పాల్గొన్నారు.