Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరిరూరల్
సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబందుపథకం కేవలం హుజూరాబాద్‌కే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా ఒకేసారి అమలు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని బండసోమారం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయానికి ఎమ్మెల్యే పైళ్లశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం పెంచికలపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని రచించి దళిత, గిరిజన, బహుజనులకు అండగా నిలిచిన అంబేద్కర్ అందరకీ స్పూర్తి అని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నూతనంగా మంజూరైన వంగపల్లి బ్రిడ్జి, అనంతారం అండర్ పాస్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. గౌరెల్లి నుంచి భద్రాచలం వరకు నూతనంగా మంజూరైన జాతీయ రహదారి ఎన్‌హెచ్ 930 కోసం రూ.2200 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. భువనగిరి కోట అభివృద్ధికి డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయన్నారు. త్వరలోనే భువనగిరి కోట పర్యాటక కేంద్రంగా మారనుందని చెప్పారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ రమేష్ గౌడ్, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జెడ్పీటీసీ సుబ్బురు బిరు మల్లయ్య, మున్సిపల్ చైర్మెన్ అంజయ్య, గ్రామ సర్పంచ్ సిలివెరు పుష్పఎల్లయ్య, ఎంపీటీసీ పాశం శివానంద్, మాజీ మున్సిపల్ చైర్మెన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ ప్రమోద్ కుమార్,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, నీల ఓం ప్రకాష్ గౌడ్, మాజీ మార్కెట్ వైస్ చైర్మెన్ అబ్బగాని వెంకటేష్, కంచి మల్లయ్య, మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.