Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్గొంగిడి సునీత
ఆత్మకూర్ఎం:సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు. రాజీనామా చేయాలంటే చేసుకోండి...కానీ అడ్డగోలుగా విమర్శలు చేస్తే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎంతో అభివృద్ధి జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ మండలాధ్యక్షులు భాషబోయిన ఉప్పలయ్య, ఎంపీటీసీ యాస కవిత, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు లగ్గాని రమేష్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా డైరెక్టర్ కోర బిక్షపతి, టీఆర్ఎస్ మండల నాయకులు పంజాల వెంకటేష్‌గౌడ్, కంబోజి భాను ప్రకాష్, నాతి రాజు, గడ్డం దశరథ, గట్టు శంకర్, అబ్బ సాయిలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.