Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
అ ముమ్మర ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ క్యాడర్ నవతెలంగాణ - మోత్కూరు
మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం శనివారం కొలువుదీరనుంది. పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి టీఆర్ఎస్ కేడర్ ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. మార్కెట్ చైర్మెన్‌గా కొణతం యాకూబ్‌రెడ్డి, వైస్ చైర్మెన్‌గా మూగల శ్రీనివాస్, డైరెక్టర్లుగా పబ్బు జయమ్మ, కంచర్ల చలపతిరెడ్డి, వంగరి మల్లయ్య, గడ్డం దశరథ, కొంగరి ఎల్లయ్య, సోలిపురం లక్ష్మారెడ్డి, సోమ నర్సయ్య, సోమ వెంకటేశ్వర్లుతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మెన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్‌రెడ్డి హాజరుకానున్నారు. మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం, మంత్రుల పర్యటన సందర్భంగా టీఆర్ఎస్ శ్రేణులు మోత్కూర్ మున్సిపల్ కేంద్రాన్ని గులాబీ మయంగా మార్చారు.
మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి
మోత్కూరు మండలంలో నేడు రాష్ట్ర మంత్రులు సింగిరెడి నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, గొంగిడి సునీతామహేందర్ రెడ్డిల పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, మార్కెట్ మాజీ చైర్మెన్ తీపిరెడ్డి మేఘారెడ్డి కోరారు. శుక్రవారం వారు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం, మండలంలోని దత్తప్పగూడెంలో రైతు వేదిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక ఎల్ఎన్ గార్డెన్లో ఉదయం 11.30 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు దత్తప్పగూడెంలో రైతు వేదిక ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు స్థానిక వైజే గార్డెన్స్ నుంచి మంత్రులకు స్వాగతం పలుకుతూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బొడ్డుపల్లి కల్యాణ్ చక్రవర్తి, మండల ప్రధానకార్యదర్శి గజ్జి మల్లేష్, కౌన్సిలర్ కూరేళ్ల కుమార స్వామి, బీసీ, ఎస్సీ సెల్ అధ్యక్షులు పానుగుళ్ల విష్ణుమూర్తి, చెడిపెల్లి రఘుపతి, యువజన, విద్యార్థి విభాగాల మండల అధ్యక్షులు దామరోజు శ్రీకాంత్ చారి, దాసరి తిరుమలేశ్, నాయకులు బయ్యని పిచ్చయ్య, దొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.