Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చివ్వేంల
దళితబందు మాదిరిగా వికలాంగులబందు తీసుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం 3వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల పరిధిలోని దురాజ్‌పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై వికలాంగులు దుర్భర జీవితాలు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ ఉన్న మాదిరిగానే చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించే విధంగా చూడాలని కోరారు. వికలాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని పర్మినెంట్‌గా ఫామ్హాజ్కు పరిమితం చేస్తామని హెచ్చరించారు. ప్రతి వికలాంగునికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలన్నారు. ఆసరా పింఛన్ వచ్చే విధంగా చూడాలన్నారు. జిల్లా కేంద్రాల్లో వికలాంగుల హాస్టల్ నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోల్లూరి ఈదయ్యబాబు, రాష్ట్ర నాయకులు గుణగంటి వెంకటేశ్వర్లుగౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్, పేర్ల సోమయ్యయాదవ్, జిల్లా నాయకులు కోమ్ముజడ రామా రావు, మండలాధ్యక్షులు కోల్లూ రి నాగరాజు, పిడమర్తి సైదులు, భద్రమ్మ, రసూల్, మద్దెల రవీందర్ పాల్గొన్నారు.