Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులను తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు తెలిపారు.పట్టణంలోని తాళ్లగడ్డ (2వ వార్డు), శాంతినగర్ కాలనీ( 28వవార్డు)ల్లో రూ.45 లక్షల నిధుల చేపట్టనున్న సీసీరోడ్లు, డ్రయినేజీ నిర్మాణ పనులను శుక్రవారం ఆయన ప్రారంభిం చారు.పట్టణాభివద్ధిలో అందరూ భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో రూ.18కోట్ల నిధులతో సీసీరోడ్ల నిర్మాణపనులను చేపడు తున్నట్టు తెలిపారు.అంతేకాకుండా, 15వ ఆర్ధిక సంఘం నుంచి మంజూరైన రూ.2కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణాలు, డ్రయినేజీ నిర్మాణపనులను వేగవంతం చేసినట్టు చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో 7వేల ఎల్ఈడీ వీధి దీపాలను అమర్చేందుకు నిధులు మంజూరు చేయిం చామన్నారు.మిర్యాలగూడ మున్సి పాలిటీని ఆదర్శ మున్సిపాలిటీల జాబితాలో చేర్చేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు.ఈ కార్యక్ర మంలో మున్సిపల్చైర్మెన్ తిరునగర్ భార్గవ్, వైస్‌చైర్మెన్ కుర్ర విష్ణు, కౌన్సిలర్లు బాసాని అలివేలుగిరి, పునాటి లక్ష్మీనారాయణ, సాలెహా భేగం, ఖాదర్, వింజమ్ శ్రీధర్, శ్రీనివాస్, ఉదరుభాస్కర్, బంటు రమేశ్, వెంకన్నగౌడ్, సైదులు, గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు.