Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆరుగురు పేకాట రాయుళ్ల అరెస్టు
నవతెలంగాణ - సూర్యాపేట
సీసీఎస్ పోలీసులు మెరుపు దాడి చేసి పేకాట ఆడుతున్న ఆరుగుర్ని అరెస్టు చేసిన సంఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డలో శుక్రవారం చోటు చేసుకుంది. తాళ్లగడ్డలోని ఓ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించి వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.32,400, ఆరు సెల్ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును పట్టణ పోలీసు స్టేషన్లో అప్పగించినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఈ దాడుల్లో సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ చనగానివెంకన్న, కొరబోయిన నర్సింహారావు, కొండ రమేష్, శ్రీను పాల్గొన్నారు