Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - రామన్నపేట
మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో నిర్వహిస్తున్న స్మశాన వాటిక పనులు నత్తనడకన సాగుతున్నాయని సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శి గోగు లింగస్వామి అన్నారు. శుక్రవారం మండలంలోని శోభనాద్రిపురంలో నిర్మిస్తున్న స్మశాన వాటిక నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. కాంట్రాక్టరు బిల్లులు డ్రా చేసుకుని పూర్తి స్థాయిలో పనులు చేయకుండా అలసత్వం వ్యవరిస్తున్నారన్నారు. వాటర్ ట్యాంక్, డ్రయినేజీ, స్నానాల గదులు, ప్లాస్టింగ్ తదితర పనులు ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ సహాయ కార్యదర్శి భీంపాక ప్రశాంత్, సభ్యులు బొడిగె సుదర్శన్, ఇర్వి రవికుమార్, బొడిగె వెంకటేష్, వడ్లకొండ రమేశ్, ఎర్ర శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.