Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేసీఆర్ నాయకత్వంలో
సుభిక్షంగా రాష్ట్రం
అ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
వందేండ్ల తర్వాత నల్లగొండ డీసీసీబీస రూ.6.50 కోట్ల లాభాల బాటలో కొనసాగుతుందని ఆ బ్యాంకు చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.శుక్రవారం జిలా ్లకేంద్రంలోని డీసీసీబీ బ్యాంక్ కార్యాలయంలో చైర్మెన్ గొంగిడి మహేందర్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు.జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ద్వారా ప్రజలకు రాష్ట్రంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తూ ఈ ఏడాది ఆడిట్ తెలిపిన వివరాల ప్రకారం వందేండ్ల తర్వాత రూ.6.50 కోట్ల లాభంతో నల్లగొండ డీసీసీబీ బ్యాంకు విజయవంతంగా నడుస్తుందన్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వంలోని రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రైతుపక్షపాతిగా సీఎం కేసీఆర్ ఉండడం యావత్ రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తూ ఉందని రైతుబంధు, రైతుబీమా ద్వారా అనేక సంక్షేమకార్యక్రమాలతో టీిఆర్ఎస్ ప్రజల్లో మంచి విజయాలను సాధిస్తుందన్నారు.పండించిన ధాన్యాన్ని రాష్ట్రప్రభుత్వం కొనుగోలు చేసి నాలుగు రోజుల వ్యవధిలోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తుందన్నారు.ఉద్యోగుల సహకారంతోనే విజయం సాధించామన్నారు.సహకార కేంద్ర బ్యాంకు చైర్మెన్లకు కనీస వేతనం రూ.25 వేలు ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లామన్నారు.డీసీసీబీ చైర్మెన్లకు, సహహర బ్యాంకు చైర్మెన్లకు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రోటోకాల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో బ్యాంకు సిబ్బంది, డీసీసీబీ డైరెక్టర్లు, డీసీసీబీ డైరెక్టర్లు, సహకార బ్యాంకు చైర్మెన్లు అధికారులు పాల్గొన్నారు.