Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డీజీపీ మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
వ్యవస్థీకత నేరాలపై ప్రత్యేక దష్టి సారించడంతో పాటు వాటిని అదుపు చేయడానికి మరింత సమర్ధ వంతమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.శుక్రవారం తన కార్యాలయం నుండి పోలీస్ ఉన్నతాధికారులు, పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో నేరాల నియంత్రించడానికి తీసు కుంటున్న చర్యలు, పెండింగులో ఉన్న కేసుల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.నల్లగొండ జిల్లాలో కేసుల పరిష్కారానికి అధికారులు చూపిస్తున్న చొరవ, నేరాలకు పాల్పడిన నేరస్తులకు కోర్టులో శిక్షలు పడే విధంగా తీసుకుంటున్న ముందస్తు చర్యలను డీజీపీ ఎస్పీ రంగనాథ్ వివరించారు.పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించడం కోసం తీసుకుంటున్న చర్యలను డీజీపీ అభినందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ప్రజాఅవసరాలకు అనుగుణంగా పోలీస్‌శాఖ పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజామన్ననలు పొందేలా ముందుకు సాగాలన్నారు. పెరిగిపోతున్న వ్యవస్థీకత నేరాలపై ప్రత్యేక దష్టి సారించి వాటి నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలన్నారు.ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ నర్మద, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, రమణారెడ్డి, సీఐలు మధు,రౌతుగోపి పాల్గొన్నారు.