Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) సూర్యాపేట జిల్లా కార్యదర్శి
మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మునగాల
నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని సీపీఐఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం మునగాల ఎల్-33 ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ విధానాల ఫలితంగా ఎత్తిపోతలు నత్తనడకన కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందడం లేదని గుర్తుచేశారు.లిప్టు చివరి భూములకు నీరందక రైతులు తిప్పలు పడుతున్నారని చెప్పారు.1975లో కో-ఆపరేటివ్ సొసైటీ ద్వారా కాలువపై ఎత్తిపోతల నిర్మాణం జరిగిందన్నారు.తదనంతరం ఐడీసీ ద్వారా మరికొన్ని లిప్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింద న్నారు.కాలువపై ఉన్న 54 ఎత్తిపోతలను ప్రభుత్వం పట్టించుకోకుండా అప్పటి ప్రభుత్వం రైతు కమిటీలకు అప్పగించి చేతులు దులుపుకుందని విమర్శించారు.దీంతో రైతుసంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించిందన్నారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి1982లో జీఓ నెంబర్161 ప్ర కారం ఎత్తిపోతలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు.కొద్దిరోజుల పాటు నిర్వహణ చేపట్టి తిరిగి రైతులకు అప్పగించిందన్నారు.అదే సమయంలో కుడికాలువపై ఉన్న ఎత్తిపోతలను ఆంధ్రాపాలకులు నిర్వహిస్తూ ఎడమకాలువపై ఉన్న ఎత్తిపోతల పట్ల వివక్ష చూపించారని విమర్శించారు.ఫలితంగా ఎత్తిపోతల పథకాల కింద లక్ష ఎకరాలకు గాను సగానికి కూడా నీరందలేదన్నారు.ఇదే విషయాన్ని 2013లో కెేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాగర్ కాలువపై వున్న ఎత్తిపోతలను ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారని గుర్తుచేశారు.టీిఆర్ఎస్ ప్రభుత్వం అధి కారంలోకి వచ్చి ఏడున్నరేండ్లవుతున్నా ఎత్తిపోతల నిర్వహణ అతీగతీ లేదన్నారు. వెెంటనే కాలువపై ఉన్న ఎత్తిపోతలను ప్రభుత్వమే నిర్వహిం చాలని, లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్దఎత్తున ఆందో ళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బుర్రి శ్రీరాములు, దండా వెంకటరెడ్డి,జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మండలకార్యదర్శి దేవరం వెంకటరెడ్డి, షేక్సైదా పాల్గొన్నారు.