Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-చింతపల్లి
రైతు దేశానికి వెన్నెముక విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్‌రెడ్డిఅన్నారు. శుక్రవారం మండలంలోని మాల్ వ్యవసాయ కమిటీ ప్రమాణస్వీకారానికి హాజరై మాట్లా డారు.వ్యవసాయం పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కు తుందన్నారు.భారతదేశ చరిత్రలో సీఎం కేసీఆర్ మొదటి స్థానంలో నిలుస్తారని, 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవన్ని హామీలు కూడా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. త్వరలో అన్ని ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ రాష్ట్రం మొత్తం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. తన మీద నమ్మకం ఉంచి మార్కెట్ చైర్మెన్‌గా పదవిని ఇచ్చి తన బాధ్యత పెంచారని మార్కెట్ చైర్మెన్ జగదీష్ అన్నారు. అందరితో ప్రమాణస్వీకారం చేయించి శాలువా కప్పి సన్మానించారు.ఎనిమిది మంది డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో చైర్మెన్ జగదీశ్వర్, వైస్ చైర్మెన్ గోపి కష్ణారెడ్డి, డైరెక్టర్లు లక్ష్మణ్,, శ్రీశైలం, చంద్రయ్య, నడింపల్లి యాదయ్య, దాసరి తిరుపతయ్య, బాజెపల్లి శ్రీదేవి, తుప్ప లక్ష్మీ, యాదిరెడ్డి, పందుల యాదయ్యగౌడ్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, సహాయ సంచాలకులు విజేందర్‌రెడ్డి, సర్పంచ్ కొండూరు శ్రీదేవి, అన్ని మండలాల టీఆర్ఎస్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ్లెక్సీ వివాదం...
ఫ్లెక్సీలో అందరి ఫొటోలు ఉన్నప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌రెడ్డి ఫొటో లేకపోవడంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ ఫొటోపెట్టి ప్రోటోకాల్ అని చెప్పి పార్టీ వేరైనప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఫొటో పెట్టక పోవడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అందులో కొంతమంది ప్రజలు అక్కడ్నుంచి వెళ్ళిపోయారు.