Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ శ్రీ స్వామినారాయణ్ గురుకుల అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేయడం అభినందనీయం
అ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ - చివ్వేంల
సూర్యాపేట జిల్లాలో శ్రీ స్వామినారాయణ్ గురుకుల అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు చేయడం అభినందనీయం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారికి అనుకొని ఉండ్రుగొండ శివారులో ఏర్పాటు చేయనున్న శ్రీ స్వామినారాయణ్ గురుకుల అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి ఆయన శుక్రవారం భూమి పూజ చేశారు. అనంతరం 120 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న అపూర్వ ఇన్ఫ్రా నారాయణ ఎకో టౌన్షిప్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పిల్లల ఉన్నత భవిష్యత్తుకు అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, స్వామి నారాయణ్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు శ్రీ దేవ్ ప్రసాద్ దాస్ జీ, జీహెచ్ఎంసి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నండూరి వెంకట వేణు మాధవ్, నిత్య స్వరూప్ స్వామి, ప్రేమ్ కుమార్ రెడ్డి, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్ రెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, అపూర్వ ఎండీ ప్రసన్నబాబు, సర్పంచ్ పల్లేటి శైలజ నాగయ్య, వేములపల్లి రాజేశ్వరరావు, దారావత్ బాబునాయక్, ఉప్పల్‌రెడ్డి, రామగిరి నగేష్, బోడపట్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు.