Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ - భువనగిరి రూరల్
సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థల ప్రారంభానికి అన్ని చర్యలూ తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు, సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి పలు మార్గ దర్శకాలు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీ లోగా అన్ని పాఠశాలలు, కళాశాలలతో పాటు రెసిడెన్షియల్ పాఠశాలల్లో నిబంధనల మేరకు అన్ని పారిశుధ్య పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధంగా ఉంచాలన్నారు. వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలు, కళాశాల అవరణాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తాగునీటి సమస్యను నివారించాలన్నారు. విద్యార్థుల్లో కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులతో పరీక్షలు చేయించి తల్లిదండ్రులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఏస్సీ అభివృద్ధి అధికారి బాల్సింగ్, బీసీ సంక్షేమ అధికారి యాదయ్య, మైనార్టీ జిల్లా అధికారి సత్యనారాయణ, గిరిజన సంక్షేమ అధికారి మంగ్త నాయక్, రెసిడెన్షియల్ పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ రజని, సజ్జన కుమార్ పాల్గొన్నారు.