Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్నగర్టౌన్
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ మొదటి వారం నుంచి సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని పారిశ్రామిక కేంద్రాల వద్ద నిర్వహించ తలపెట్టిన పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు కోరారు. ఆదివారం పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో కృష్ణపట్టె సిమెంట్ క్లస్టర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలన్నారు. పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనం రూ.24,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదేండ్లు దాటిన వారికి పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీతల రోషపతి, నాయకులు ఎలక సోమయ్యగౌడ్, గోవిందు, ప్రభాకర్, వేణు, శౌరి, నాగేశ్వరరావు, శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.