Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఒకరు మృతి
అ పలువురికి గాయాలు
అ కోదాడలోని రామాపురం క్రాస్‌రోడ్డు
వద్ద ఘటన
నవతెలంగాణ - కోదాడరూరల్
కస్టమర్లపై వైన్‌షాపు యాజమాన్యం చేసిన దాడిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా షేర్ మహమ్మద్‌పేట గ్రామానికి చెందిన కాకనబోయిన నాగయ్య (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రామపురం క్రాస్ రోడ్డులోని హనుమాన్ వైన్ షాప్ వద్ద మద్యం ప్రియులకు వైన్స్ యాజమాన్యానికి మధ్య మాటామాట పెరిగి గొడవకు దారితీసింది. వైన్స్ యాజమాన్యం మందుబాబులపై దాడికి దిగింది. ఈ గొడవను ఆపాలని చూసిన నాగయ్యపై వైన్ షాప్ యాజమాన్యం కర్రలతో దాడి చేసింది. ఈ ప్రమాదంలో నాగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన జరిగిన తర్వాత వైన్స్ యాజమాన్యం షాపును బంద్ చేసి అక్కడి నుంచి పారిపోయింది. విషయం తెలుసుకున్న షేర్ మహమ్మద్ పేట గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు లాఠీచార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రఘు పరిశీలించారు.