Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హుజూర్‌నగర్‌టౌన్
పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని డీివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు బోయిళ్ల నవీన్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అమరవీరుల భవనంలో నిర్వహించిన ఆ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలకు పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ప్రజలకు డెంగీ, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయని తెలిపారు. గతంలో పట్టణంలో పలువురు సీజనల్ వ్యాధులతో మృతి చెందిన ఘటనలు ఉన్నందున వైద్య ఆరోగ్య శాఖ స్పందించాలని కోరారు. ఈ నెల 31న పట్టణంలో జరిగే సంఘం పట్టణ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి నాగారపు పాండు, రైతు సంఘం జిల్లా నాయకులు దుగ్గి బ్రహ్మం, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మీసాల వీరబాబు, నాయకులు ఇందిరాల వెంకటేష్, రాజేష్, ఎస్కె.బాబా, శ్రీను, ఆర్.ప్రేమ్‌కుమార్, వెంకటేశ్వర్లు, వీరబాబు, అబ్రహం, నరేష్ తదితరులు పాల్గొన్నారు.