Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కేంద్ర సాగు చట్టాలు భారత్ లాంటి వర్ధమాన దేశాలకు గుదిబండ
అ వ్యవసాయం వృత్తి కాదు.. సమస్త జీవరాశికి ఆధారం
అ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
సినీ ఇండిస్టీలో పీపుల్స్ స్టార్‌గా గుర్తింపు పొందిన ఆర్.నారాయణమూర్తి సమాజహితం కోసం స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రైతన్న చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఆదరించాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు కోరారు. మిర్యాలగూడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆర్.నారాయణ మూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలు భారత్ లాంటి వర్ధమాన దేశాలకు గుదిబండలా మారాయ న్నారు. రైతుల సమస్యలను తెరకెక్కించిన రైతన్న చిత్రాన్ని తానూ వీక్షించినట్టు తెలిపారు. రైతన్న సినిమాను మిగతా భాషల్లోకి కూడా అనువదించాలని నారాయణమూర్తిని కోరారు.