Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చట్టాలతో రైతు వెన్ను విరిచారు
సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి
నవతెలంగాణ -నల్లగొండ
దేశానికి రైతే వెన్నెముక అని సినీ నటుడు, నిర్మాత ,దర్శకుడు ఆర్ .నారాయణమూర్తి అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా 'రైతన్న' సినిమా విడుదల సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని వారి నివాసంలో కలుసుకుని చిత్రంలోని విశేషాల గురించి వివరించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్ల చట్టాలతో రైతు వెన్నును విరిచేస్తున్నారన్నారు. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపుతున్నారన్నారు. ఈ దేశంలో ఎక్కువగా సామాజికంగా వెనుకబడిన వారు మొదట రైతులే వస్తారన్నారు. ఏ చట్టాలు తెచ్చినా రైతుల నుంచి ధాన్యాన్ని తాము స్థానికంగా ధాన్యపు కేంద్రాలనుండి కొనుగోలు చేస్తామని కేసీఆర్ ప్రభుత్వం అనడం హర్షణీయమన్నారు. ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా పని చేస్తుందని అన్నారు. తమ రైతన్న చిత్రాన్ని ఆదరించి రైతులను చైతన్య పరచాలని ఈ సందర్భంగా టీఆర్ఎస్నాయకులను కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నారాయణ మూర్తి రైతుల కోసం నిర్మించిన చిత్రం రైతన్న చిత్రాన్ని ప్రతి ఒక్క రైతు కుటుంబం చూసి ఆదరించి చైతన్యం కావాలన్నాఉ. వచ్చే నెల 5వ తేదీన ఈ చిత్రాన్ని తామంతా చూస్తామనిన్నారు. విద్య,వైద్యం పట్ల,కూడా ప్రజలను కార్పొరేట్ ఆసుపత్రులు ఎలా దోచుకుంటున్నాయో... ప్రజలను చైతన్యపరిచే విధంగా మరో చిత్రాన్ని నిర్మించాలని, కూడా అందులోతనను కూడా భాగస్వామిని చేయాలని అన్నారు. అనంతరం నారాయణ మూర్తిని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ , పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, రాష్ట్ర నాయకులు చకిలం అనిల్‌కుమార్ సమక్షంలో, శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మెన్ సైదిరెడ్డి, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్ , పిల్లి రామరాజు యాదవ్, అభిమన్యు శ్రీనివాస,్ ప్రముఖ కవి గాయకుడు చింతల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.