Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రామాల్లో సేవలు కొనసాగించాలని పిలుపు
డీసీపీ నారాయణరెడ్డి
నవతెలంగాణ- భువనగిరిరూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీఆర్కె హాస్పిటల్ పల్లె పల్లెకు వైద్యం కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక గ్రామాన్ని తీసుకొని, 75 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం గొప్ప విషయమని రాచకొండ కమిషనరేట్ భువనగిరి డీసీపీ కె.నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని గంగసానిపల్లి గ్రామంలో 75వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సామాజిక దక్పథంతో గ్రామాల్లో పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో జిల్లావ్యాప్తంగా ప్రతినెలా ఒక గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వారికి వత్తిపరంగా అమూల్యమైన సలహాలు సూచనలు అందజేసి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ కె హాస్పిటల్ అధినేత సిహెచ్ రాజకుమార్, వైద్య సిబ్బందిని ఆయన అభినందించారు. పల్లె పల్లెకు వైద్యం కార్యక్రమం కొనసాగించాలని ఆకాంక్షించారు.అనంతరం ఆర్కె .హాస్పిటల్ అధినేత డాక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తనకు సహకరించిన వైద్య సిబ్బందికి, మెడికల్ రిప్రజెంటేటివ్, ఇతర సిబ్బందికి కతజ్ఞతలు తెలియజేస్తూ, అందరి సహకారంతో 100 క్యాంపులు పూర్తి చేస్తామని తెలిపారు. పల్లెపల్లెకు వైద్యం అందిస్తూ గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యం పై అవగాహన కల్పించడమే పల్లెపల్లెకు వైద్యం యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. గ్రామాల్లో వ్యాధులపై అవగాహన కల్పించడం, వారికి ఆరోగ్యం పట్ల తగిన సలహాలు సూచనలు అందిస్తూ ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. 75 క్యాంపులు పూర్తి కావడానికి సహకరించిన వైద్య సిబ్బందికి ఇతరులకు శాలువాతో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంపల్లి నగేష్ గౌడ్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ రెడ్డి, రూరల్ సిఐ జానయ్య, రూరల్ ఎస్సై కె.సైదులు , ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.