Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఒకరు మతి, మరొక్కరికి తీవ్ర గాయాలు
నవతెలంగాణ -భువనగిరి రూరల్
లారీ బైకును ఢ కొట్టడంతో ఒకరు మృతిచెందగా మరొక్కరికి తీవ్రగాయాలైన సఘటన ఆదివారం రాత్రి మండల పరిధిలోని హనుమాపురం ఎక్స్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరికి చెందిన రాయవరపు శివరాజ్ (18) అతని స్నేహితుడు వెంకటకష్ణతో కలిసి మండలంలోని తాజ్పూర్ గ్రామానికి వెళ్లి తిరిగి రాత్రి సమయంలో భువనగిరికి వస్తున్నాడు. మార్గమధ్యలో హనుమపురం ఎక్స్ రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢ కొట్టింది. దీంతో శివరాజ్ అక్కడికక్కడే మతిచెందాడు. అతని స్నేహితుడు వెంకటకష్ణ కు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియాసుపత్రికి తరలించారు. మతుని బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్సై సైదులు తెలిపారు.
ట్రాక్టర్ బోల్తా..ఒకరికి గాయాలు
గ్రామపంచాయతీ ట్రాక్టర్ బోల్తాపడగా ఒకరికి గాయాలైన సంఘటన ఆదివారం మండంలోని ని రెడ్డి నాయక్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డినాయక్‌తండా గ్రామపంచాయతీకి చెందిన ట్రాక్టర్ వాటర్ ట్యాంకర్‌తో కొడుతున్న సమయంలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌ను నడుపుతున్న భాస్కర్‌నాయక్ తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.