Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సోములు మతిపై డీఎస్పీ విచారణ
నవతెలంగాణ -మునుగోడు
మండలంలోని కొరటికల్ గ్రామంలో కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని అమ్మాయి తల్లిదండ్రులు , కుటుంబ సభ్యులు అబ్బాయి తండ్రి దండు సోములును చంపేస్తామని బెదిరించడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోములు ఆదివారం సోములు అంత్యక్రియల్లో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా చండూరు సీఐ సురేష్ కుమార్తో పాటు ఐదుగురు ఎస్సైలు ,ముగ్గురు ట్రైనింగ్ ఎస్సైలు, ఇద్దరు ఏఎస్సైలతో పోలీసుల భారీ బందోబస్తు నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి సోములు మతి చెందిన సంఘటనా స్థలానికి వచ్చి విచారించారు. మతికి కారణమైన వివరాలను కుటుంబ సభ్యులను, బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సోములు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితుల పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోములు పై బెదిరింపులకు పాల్పడిన కులం పేరుతో దూషించిన వ్యక్తులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు వేధింపులకు గురి చేసిన కేసు నమోదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి రిమాండ్కు తరలించినట్టు ఎస్ఐ రజినీకార్ రెడ్డి తెలిపారు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలి
కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని తండ్రి సొములు పై బెదిరింపులకు పాల్పడి, మతి చెందడాన్ని కి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున , మాదిగ జేఏసి మండల అధ్యక్షుడు పందుల సురేష్ డిమాండ్ చేశారు సోము మత దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సోములు కుటుంబానికి అండగా ఉంటాం
మండలంలోని కొరటికల్ గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న దండు సోములు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ కార్మిక విభాగం జిల్లా కార్యదర్శి దండు యాదయ్య , బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి విజరు , సర్పంచ్ వల్లూరి పద్మ లింగయ్య,ఉప్ప సర్పంచ్ ఎల్లంకి యాదగిరి గౌడ్ అన్నారు. ఆదివారం సోములు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి వెంట యువజన నాయకులు ఐతరాజు పర్వతాలు,వార్డు సభ్యులు శంకర్ గౌడ్ ,వెంకన్న ,మాలిగా యాదయ్య తదితరులు ఉన్నారు .